ప్రధాని మోదీని కలిసిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి .. కాంగ్రెస్ వర్గాల్లో టెన్షన్..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి (file)

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం నాడు ప్రధాని మోదీని కలిశారు. సీఎం కేసీఆర్ తీరుపై ప్రధానికి ఫిర్యాదు చేశారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం నాడు ప్రధాని మోదీని కలిశారు. సీఎం కేసీఆర్ తీరుపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. దీనిపై.. చర్యలకు దిగుతామని ప్రధాని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి మీడియాతో చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో రెండు, మూడు కంపెనీలతో సిండికేట్ అయ్యి ఏ విధంగా దోచుకుంటున్నారన్నది తాను ప్రధానికి వివరించానని తెలిపారు. రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినా మిషన్‌ భగీరథ ఇంకా పూర్తి కాలేదని, కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, కేంద్రమే ఇళ్ల నిర్మాణ బాధ్యత చేపట్టాలని ప్రధానిని కోరానని ఆయన చెప్పారు. కేసీఆర్‌ రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేంద్రం నుంచి రూ.లక్షా 75 వేల కోట్లు రుణం తీసుకొచ్చారని చెప్పానని వివరించారు. తనకు అన్నీ తెలుసని, అవినీతి వ్యవహారాలను సీరియస్‌గా పరిగణించి చర్యలకు దిగుతామని ప్రధాని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.

    కాగా, రాజకీయాలపై మాట్లాడారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని కోమటిరెడ్డి తెలిపారు. అయితే, ప్రధానితో ఆయన భేటీ కొందరు కాంగ్రెస్ నేతలకు షాక్‌లా అనిపించింది. ఏకంగా ప్రధానితో భేటీ కావడంపై ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు. ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న నేత.. బీజేపీలోకి జంప్ అవుతారా? అంటూ కొందరు రాజకీయ పండితులు ప్రశ్నించుకుంటున్నారు కూడా.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: