బీజేపీలోకి వెళ్లడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ

తాను తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: June 18, 2019, 6:04 PM IST
బీజేపీలోకి వెళ్లడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తాము పార్టీ మారుతున్నామని, బీజేపీలోకి వెళుతున్నామని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో... దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదని, పార్టీని ప్రక్షాళన చేయాలని మాత్రమే కోరారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తుది శ్వాస విడిచేవరకూ తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తాను ఈ స్థాయికి చేరుకున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పని చేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తాను పార్టీ మారే ప్రసక్తే ఉండదని అన్నారు. దీనిపై మళ్లీ మళ్లీ అడిగి తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... పార్టీ బాగుండాలని.. ఎన్నికల్లో గెలవాలని, తెలంగాణ ఇచ్చి రెండోసారి కూడా గెలవలేకపోయాం కాబట్టి ప్రక్షాళన చేయాలని కోరారు తప్ప పార్టీ మారతానని ఆయన ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాబోయే నాలుగేళ్లు కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు.


First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...