టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నయా ప్లాన్...

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం తరువాత ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది.

news18-telugu
Updated: March 6, 2020, 5:25 PM IST
టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నయా ప్లాన్...
సీఎం కేసీఆర్, భట్టి విక్రమార్క
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై టీఆర్ఎస్‌ను నిలదీయాలని భావిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... ఈ విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇందుకోసం కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను పలువురు పంచుకున్నారు. మున్సిపల్, ఇరిగేషన్ అంశాలకు సంబంధించిన అంశాలను లెవనెత్తే బాధ్యత రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు. నిరుద్యోగం అంశంపై భట్టి విక్రమార్క, రైతుల సమస్యలపై శ్రీధర్ బాబు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశం జగ్గారెడ్డి, సీతక్కకు విద్య, గిరిజన సంక్షేమం, గిరిజన విద్య అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను పొందెం వీరయ్యకు అప్పగించారు. ఈ మేరకు సీఎల్పీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి సీఎల్పీ విలీనం తరువాత ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఎవరు పార్టీలో కొనసాగుతారు ? ఎవరు పార్టీని వీడతారు ? అనే సందేహంలోనే ఆ పార్టీ నేతలు ఉండిపోయారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ రకంగా పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతలను పంచుకోవడం... ఆ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడే అనే టాక్ వినిపిస్తోంది. ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేల బలంతోనే అధికార టీఆర్ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీలో తిరుగులేని సంఖ్యాబలం ఉన్న టీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతవరకు ఎదుర్కొంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by: Kishore Akkaladevi
First published: March 6, 2020, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading