కాంగ్రెస్‌కు మరో షాక్... టీఆర్ఎస్‌లోకి చేరనున్న పాలేరు ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాటి ఉపేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.

news18-telugu
Updated: March 14, 2019, 3:38 PM IST
కాంగ్రెస్‌కు మరో షాక్... టీఆర్ఎస్‌లోకి చేరనున్న పాలేరు ఎమ్మెల్యే
కేటీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి
  • Share this:
తెలంగాణలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీమంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్‌ను కలిసి ఒక రోజు గడవకముందే... కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాటి ఉపేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పోటీ ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు.

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉపేందర్ రెడ్డి కూడా చేరడంతో... కాంగ్రెస్ వైపు నుంచి టీఆర్ఎస్‌లోకి ఇంకెంతమంది వచ్చి చేరతారో అని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే... ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading