Home /News /politics /

TELANGANA CONGRESS MLA KOMATIREDDY RAJAGOPAL REDDY WENT TO DELHI MAY JOIN IN BJP SB

ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే... ఇవాళ బీజేపీలో చేరే ఛాన్స్ ?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (file)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (file)

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమంటూ... తెలంగాణ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

    మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం అనిపిస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ ఆయన బీజేపీ కీలక నేతలతో భేటీ కానున్నారు. తనతో పాటు బీజేపీలో చేరనున్న నేతల వివరాలను కూడా తనతో పాటు తీసుకెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు ఈనెల 28న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తొంది హైకమాండ్. కొన్ని రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వంలో లోపం ఉంది. నేతలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వేటు వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఢిల్లీకి పయనమవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమంటూ... తెలంగాణ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Bjp, Congress, Komatireddy rajagopal reddy, Telangana, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు