బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి...ఎంపీ కోమటిరెడ్డి పరిస్థితేంటి ?

Komatireddy Rajagopal reddy may join bjp | నేడు సాయంత్రం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బీజేపీలో చేరే అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: June 20, 2019, 11:10 AM IST
బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి...ఎంపీ కోమటిరెడ్డి పరిస్థితేంటి ?
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ వ్యాఖ్యానించి కాంగ్రెస్ అధిష్టానం నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో కొనసాగేది లేదని ఆయన తన ముఖ్య అనుచరులతో అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటన చేసిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

తనతో పాటు తన సోదరుడైన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం ఆయన బీజేపీలోకి తీసుకెళతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో బీజేపీ ఎంపీలు బల్లలు చరిచి అభినందించడం... ఆయనను వెల్‌కమ్ టు బీజేపీ అని కామెంట్ చేయడం సరికొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలోకి వెళతారా లేక తన సోదరుడు ఎంపీ వెంకట్ రెడ్డిని కూడా తనతో పాటు బీజేపీలోకి తీసుకెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
.First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>