హోమ్ /వార్తలు /రాజకీయం /

తెలంగాణలో కాంగ్రెస్ కథ కంచికేనా.. అసెంబ్లీలో విపక్ష హోదా గల్లంతేనా?

తెలంగాణలో కాంగ్రెస్ కథ కంచికేనా.. అసెంబ్లీలో విపక్ష హోదా గల్లంతేనా?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీ తేరుకోలేకపోతోంది. ఇప్పటికే అధికార పార్టీ దూకుడుతో.. మండలిలో విపక్ష హోదాను కోల్పోయి, ప్రాతినిథ్యాన్ని కూడా కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న హస్తం పార్టీ, ఇక అసెంబ్లీలోనూ చాప చుట్టేసుకునే పరిస్థితి ముంచుకొస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీ తేరుకోలేకపోతోంది. ఇప్పటికే అధికార పార్టీ దూకుడుతో.. మండలిలో విపక్ష హోదాను కోల్పోయి, ప్రాతినిథ్యాన్ని కూడా కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న హస్తం పార్టీ, ఇక అసెంబ్లీలోనూ చాప చుట్టేసుకునే  పరిస్థితి ముంచుకొస్తున్నట్టుగా అనిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలోనే శాసనసభలోనూ కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా పోయే ప్రమాదం కనిపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఇప్పటికే  టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంఖ్యాబలం అసెంబ్లీలో 11కు చేరింది. లెక్కల ప్రకారం మొత్తం అసెంబ్లీ సీట్లలో పదిశాతం గెలిస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు సాధించిన కాంగ్రెస్.. ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. కానీ ఇప్పుడా సంఖ్య 11కు పడిపోవడంతో విపక్ష హోదా కూడా గల్లంతయ్యే పరిస్థితి తలెత్తింది.


    ఇటీవలి రెండు మూడు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, హరిప్రియ నాయక్, వనమా తదితరులు.. టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రెండ్రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్లో కూడా ఎవరికీ అందుబాటులోకి రాకపోవడంతో ఆయన కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..  కారెక్కిన ఎమ్మెల్యేలంతా కలిసి.. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్.. కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా ప్రభావం చూపించాలనుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష హోదా కూడా ఉండేలా కనిపించడం లేదు. చూడాలి ఏం జరుగుతుందో మరి.

    First published:

    Tags: CM KCR, Telangana, Telangana Election 2018, Trs, TS Congress

    ఉత్తమ కథలు