టీ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి చిచ్చు.. సీనియర్ల ఫైట్..

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరినప్పటి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.

news18-telugu
Updated: November 5, 2019, 9:30 PM IST
టీ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి చిచ్చు.. సీనియర్ల ఫైట్..
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వ్యవహారం దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ, వీహెచ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ముందే వారిద్దరూ పరస్పరం వాదులాడుకున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, తనలాంటి సీనియర్లను అసలు పట్టించుకోవడం లేదని వీహెచ్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఆయన్ను వారించారు.

రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఉత్తమ్ భార్య పద్మావతిరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించినప్పుడు కూడా రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు చెప్పకుండా పేరు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దీన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరినప్పటి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.

సమస్య పరిష్కరిస్తారా.. పెట్రోల్ తెమ్మంటారా? రైతు హెచ్చరిక

First published: November 5, 2019, 9:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading