కీలక భేటీలు, విస్తృత చర్చలు.. కూటమి నేతల మంతనాలు

ఎన్నికలకు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో ప్రజాకూటమి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా పీసీసీ కీలక నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు చంద్రబాబుతో సమావేశమై.. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

news18-telugu
Updated: December 3, 2018, 1:30 PM IST
కీలక భేటీలు, విస్తృత చర్చలు.. కూటమి నేతల మంతనాలు
భట్టి విక్రమార్క, రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
అధికార పార్టీ ఎత్తులకు.. పై ఎత్తులు వేస్తూ.. ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తోంది ప్రజాకూటమి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో కూటమి అభ్యర్థుల తరపున రోడ్ షోలు నిర్వహిస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరోవైపు జిల్లాల్లోనూ కూటమి నేతలు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ఉత్తమ్, కుంతియా, భట్టి విక్రమార్కలు చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కూటమిలోని ప్రధాన నాయకులను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడంపై.. కూటమి నేతలు చంద్రబాబుతో చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్, భట్టి విక్రమార్క పోటీచేస్తున్న మదిర స్థానాలు సమావేశంలో ప్రస్తానవకు వచ్చాయి. తాజాగా ఈ నియోజకవర్గాల్లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులపైనా నేతలు చర్చలు జరిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీఆర్ఎస్ పార్టీ తీరును ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక, ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి రానున్న నేపథ్యంలో.. ఆయన ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలపైనా చంద్రబాబుతో చర్చించారు కాంగ్రెస్ నేతలు. పతాకస్థాయికి చేరిన ప్రచారంలో వ్యూహప్రతివ్యూహాలు రూపొందిస్తూ.. టీఆర్ఎస్‌ ను ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని నేతలు నిర్ణయించారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 3, 2018, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading