గవర్నర్‌ను కలవనున్న టీకాంగ్రెస్ నేతలు.. సీపీపై ఫిర్యాదు చేసే అవకాశం

హైదరాబాద్ సీీపీ అంజనీ కుమార్, టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ కాల్‌కు సరిగా సమాధానం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించడం వంటి అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నాయకులు.

news18-telugu
Updated: December 31, 2019, 11:49 AM IST
గవర్నర్‌ను కలవనున్న టీకాంగ్రెస్ నేతలు.. సీపీపై ఫిర్యాదు చేసే అవకాశం
ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)
  • Share this:
మరికాసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు కాంగ్రెస్ నాయకులు. రాజభవన్ లో ఆమెతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వక పోవడం గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. తెలంగాణ విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం శాంతి భద్రతలను గవర్నర్ కు ఉన్న అధికారాలను వినియోగించాలని తమిళిసైను కోరనున్నారు కాంగ్రెస్ నాయకులు. గాంధీభవన్‌లో 135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలను గాంధీ భవన్‌కు రాకుండా అడ్డుకోవడం, అరెస్టులు చేయడంపై గవర్నర్‌కు పిర్యాదు చేయనున్నారు. హైదరాబాద్ సీీపీ అంజనీ కుమార్, టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ కాల్‌కు సరిగా సమాధానం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించడం వంటి అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నాయకులు.

ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ అంజనీకుమార్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పోలీస్ కమిషనర్‌పై ఆయన మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌ ఆవరణలో కాంగ్రెస్‌నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేస్తారా? ఇదేం పద్ధతి అని సీపీని ప్రశ్నించారు.

First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు