వాస్తు బాగా లేదనే సచివాలయం కూల్చివేత.. సీఎంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.

news18-telugu
Updated: July 7, 2020, 5:24 PM IST
వాస్తు బాగా లేదనే సచివాలయం కూల్చివేత.. సీఎంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
సచివాలయం భవనం (ఫైల్ ఫోటో)
  • Share this:
సచివాలయం కూల్చివేత వ్యవహారంపై తెలంగాణ ఇప్పడు రాజకీయ దుమారం రేగుతోంది. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా కష్టాల్లో ప్రభుత్వానికి ఆదాయం లేదని చెప్పే నేతలు.. ఇప్పుడు ఉన్న సచివాలయాన్ని కూల్చతే కొత్తది ఎందుకు కడుతున్నారో చెప్పాలని మండిపడుతున్నారు. కేవలం వాస్తు బాగాలేదన్న కారణంతోనే సచివాలయాన్ని కూల్చుతున్నారని.. రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ సచివాలయం కూల్చడం పిచ్చితుగ్లక్ చర్య. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మతిభ్రమించింది. ఉన్న సచివాలయంలో ముఖ్యమంత్రుల కొడుకులు ఎవరు సీఎంలు కాలేదనే.. సచివాలయాన్ని కేసీఆర్ కూల్చేస్తున్నారు. వాస్తు లేదనే కూల్చేస్తున్నారు. రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్ వృథా చేస్తున్నారు. కరోనాతో మనుషులు చనిపోతుంటే కేసీఆర్ చేతులు ఎత్తేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకోవాలి. కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ


కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. సీఎం కేసీఆర్ ప్రజల సంపదను దోచుకుంటున్నారు. ప్రజలంతా కరోనాతో ఇబ్బందుల్లో ఉంటే ఆగమేఘాల మీద సచివాలయాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారో బయటకొచ్చి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అసెంబ్లీలో చెప్పిన విధంగా మీరు, మీ ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండా బయటకు వచ్చి సేవ చేయాలి.
మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత


తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పాత సచివాలయ భవనాన్ని కూల్చేస్తున్నారు.

సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఈ అంశంలో అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... సచివాలయం వైపు వెళ్లే మార్గాలను మూసివేసి ఈ పనులు కొనసాగిస్తోంది. ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading