తెరపైకి రేవంత్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్... ఏం జరుగుతోంది ?

రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 6, 2019, 12:52 PM IST
తెరపైకి రేవంత్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్... ఏం జరుగుతోంది ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి వస్తుందా ? లేదా అనే అంశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు టీ పీసీసీ చీఫ్ పదవి ఖాయమైందని... అందుకే ఆయన కుటుంబసమేతంగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కలిశారనే వార్తలు కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డికి టీ పీపీసీ ఛీప్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయిం తీసుకోవడం వల్లే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వంటి వాళ్లు పరోక్షంగా ఆయనపై విమర్శలు మొదలుపెట్టారనే టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో పని చేశారని... ఆయనకు ఆర్ఎస్ఎస్‌తోనూ సంబంధాలు ఉండేవని కొందరు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అలాంట నాయకుడికి కాంగ్రెస్ పగ్గాలు ఎలా అప్పగిస్తారని పలువురు నేతలు అహ్మద్ పటేల్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది. మొదట్లో బీజేపీ, ఆ తరువాత టీడీపీలో పని చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే... తాము కాంగ్రెస్‌లో కొనసాగబోమని కొందరు నేతలు అహ్మద్ పటేల్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం.

దీంతో ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన కాంగ్రెస్ నేతలకు సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీ పీసీసీ చీఫ్ మార్పు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కుంతియా అన్నారని పలువురు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి దక్కకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌లో ఓ వర్గం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది.
First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading