• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA CONGRESS LEADERS MET DGP TO REQUESTING SECURITY FOR IMPORTANT LEADER OF CONGRESS

భద్రత కల్పించండి.. డీజీపీని కోరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

భద్రత కల్పించండి.. డీజీపీని కోరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి( ఫైల్ ఫోటో)

Telangana assembly elections 2018|తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలకు ప్రాణహాని ఉన్నందున.. భద్రత కల్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చారు.

  • Share this:
    తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా.. జరిగిన గొడవలపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ముఖ్యనాయకులపై టీఆర్ఎస్, బీజేపీ నాయకులు గూండాల్లా దాడి చేశారని ఆరోపించింది. ఇదే అంశంపై పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడినవారిపై తగినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యుర్థుల దాడులకు గురై.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, చేవెళ్ల అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డిలతో పాటు తనకు కూడా భద్రత కల్పించాలని టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి కోరారు. డీజీపీకి వినతిపత్రం అందజేశారు.



    టీపీసీసీ ప్రముఖనేతలకు ప్రాణహాని ఉన్నందున తక్షణమే స్పందించాలని డీజీపీని విజ్ఞప్తి చేశారు టీపీసీసీ నేతలు. పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతికి కూడా తగిన భద్రత కల్పించాలని కోరారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడాన్ని చూస్తే..  అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలకు పోలీసుశాఖ సెక్యూరిటీని తగ్గించినట్టు భావించవలసి వస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తక్షణమే ముఖ్యనాయకులకు తగిన భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి భద్రతను పెంచినందుకు టీపీసీసీ నేతలు డీజీపీకి లేఖలో ధన్యవాదాలు తెలిపారు.
    Published by:Santhosh Kumar Pyata
    First published:

    అగ్ర కథనాలు