Home /News /politics /

TELANGANA CONGRESS LEADER PONNAM PRABHAKAR RESPOND ON CHANGING PARTY SB

పార్టీని వీడనంటూ బాండ్ పేపర్‌పై సంతకం పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేత

పొన్నం ప్రభాకర్(File)

పొన్నం ప్రభాకర్(File)

ఈ విషయంలో తనపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసు కూడా పెట్టవచ్చన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఈ అఫిడవిట్‌ ప్రతులను లోక్‌సత్తా, అనేక స్వచ్ఛంద సంస్థలకు, ప్రజా సంఘాలకు పంపిస్తున్నట్లు వివరించారు.

  కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెల్లువెత్తుతుండగా.. మరో కీలక నేత కూడా పార్టీ మారబోతోన్నట్లు ప్రచారం సాగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ పార్టీ మారబోతున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను పార్టీ మారుబోతున్నానని అనడం సరికాదన్నారు. ఎట్టి ఏ పరిస్థితుల్లోనూ పార్టీ మారనని అఫిడవిట్‌ ఇస్తున్నానని ప్రకటించారు పొన్నాం. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం తెలిపారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాండు ద్వారా తన అఫిడవిట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆరోపించారు. దీంతో చాలామంది తనను కూడా గెలిస్తే పార్టీ మారతారా? అని ప్రశ్నించారన్నారు. అందుకే తాను అఫిడవిట్ ఇచ్చానని తెలిపారు. ఒకవేళ పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని చెప్పారు పొన్నాం. ఈ విషయంలో తనపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసు కూడా పెట్టవచ్చన్నారు. ఈ అఫిడవిట్‌ ప్రతులను లోక్‌సత్తా, అనేక స్వచ్ఛంద సంస్థలకు, ప్రజా సంఘాలకు పంపిస్తున్నట్లు వివరించారు.

  ఎన్నికల్లో బీజేపీపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌, వినోద్‌కుమార్‌లు ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీతో జతకట్టమని అఫిడవిట్‌ ద్వారా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వినోద్‌కుమార్‌ గెలిస్తే మంత్రి అవుతారని అంటున్న కేటీఆర్‌ ఏ పార్టీ ప్రభుత్వం ద్వారా మంత్రి అవుతారో చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాను ఏడు ముక్కలు చేశారని, కరీంనగర్‌కు మెడికల్‌కాలేజ్‌ ప్రకటించి ఇవ్వలేదని మండిపడ్డారు పొన్నాం. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని మోసం చేశారని విమర్శించారు. పోరాడితే పొన్నంలాగా పోరాడాలని కేసీఆర్‌ ఉద్యమ సమయంలో అన్నారని గుర్తు చేశారు. పాఠశాల బస్సులను ఎన్నికలకు ఉపయోగించారని.. అయినా ఎలక్షన్‌ కమీషన్‌ చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.

  ఇవికూడా చదవండి: 

  మహిళా అనుచరుల గదుల్లో తనిఖీలు... బస్టాండ్‌లో రేణుకా చౌదరి ధర్నా 

  హైదరాబాద్ మెట్రోరైలెక్కిన సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ
  First published:

  Tags: Karimnagar S29p03, Telangana Lok Sabha Elections 2019, TS Congress

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు