Revanth Reddy-Janareddy: రేవంత్ రెడ్డి ఫ్యాన్స్‌కు జానారెడ్డి వార్నింగ్.. అలా చేయొద్దంటూ..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy-Janareddy: అభిమానులతో పాటు నాయకులు కూడా క్రమశిక్షణతో ఉండాలని.. ఓ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వారిని సూచనలు చేయాలని తెలిపారు.

  • Share this:
    కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి పరోక్షంగా రేవంత్ రెడ్డి అభిమానులకు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్‌ మీడియాలో కొంత మంది పార్టీ నాయకులపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతరులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది నాయకుల అభిమానులు ఇలాంటివి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలు సరికావని జానారెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి వాటి వల్ల ఆ నాయకుడికే నష్టం జరుగుతుందని సూచించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకోవాలని జానారెడ్డి కోరారు. వీటిని పీసీసీ దృష్టికి తీసుకెళతామని అన్నారు.

    ఒకవేళ ఈ వ్యవహారాన్ని పీసీసీ పట్టించుకోకపోతే కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని జానారెడ్డి స్పష్టం చేశారు. అభిమానులతో పాటు నాయకులు కూడా క్రమశిక్షణతో ఉండాలని.. ఓ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వారిని సూచనలు చేయాలని తెలిపారు. మరోవైపు తాము లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి కేటీఆర్‌పై కూడా జానారెడ్డి మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే పీఆర్సీ కమిషన్ ఇచ్చిన లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఎక్కడినుండి వచ్చిందని ప్రశ్నించారు.

    Janareddy news, congress News, janareddy versus kcr, kcr versus janareddy, trs versus congress, జానారెడ్డి, కాంగ్రెస్ న్యూస్, జానారెడ్డి వర్సెస్ కేసీఆర్, తెలంగాణ న్యూస్
    జానారెడ్డి (ఫైల్ ఫొటో)


    ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని జానారెడ్డి ప్రశ్నించారు. తాను 30 ఏళ్ల క్రితం అమ్మిన ఇంటికి నీళ్లు ఇస్తున్నామని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తన నియోజకవర్గంలో అనేక గ్రామాలకు నీరు రావడం లేదని.. మీడియా సాక్షిగా ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జానారెడ్డి సవాల్ విసిరారు.
    Published by:Kishore Akkaladevi
    First published: