HOME »NEWS »POLITICS »telangana congress leader jagga reddy alleges bjp leader amit shah is behind elevation of ktr as cm ba

KTR as CM: కేటీఆర్ సీఎం ప్లాన్ వెనుక అంతా ఆ బీజేపీ అగ్రనేతదే: జగ్గారెడ్డి

KTR as CM: కేటీఆర్ సీఎం ప్లాన్ వెనుక అంతా ఆ బీజేపీ అగ్రనేతదే: జగ్గారెడ్డి
మంత్రి కేటీఆర్(ఫైల్ పొటో)

తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావును చేయాలనే ప్లాన్ వెనుక బీజేపీ అగ్రనేత ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయినా తండ్రి సీఎం అయితే, ఆ తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అవుతారని, ఎక్కడైనా అల్లుడిని సీఎం చేస్తారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావును చేయాలనే ప్లాన్ వెనుక బీజేపీ అగ్రనేత ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయినా తండ్రి సీఎం అయితే, ఆ తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అవుతారని, ఎక్కడైనా అల్లుడిని సీఎం చేస్తారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో సీఎం మార్పు అనేది ఇంటి పంచాయతీ. కేసీఆర్ కొడుకుని సీఎం చేస్తారో.. కూతురుని చేస్తారో ఆయన ఇష్టం. సీఎం మార్పు వెనుక బీజేపీ ఆట ఉందనుకుంటా. కేటీఆర్ ని సీఎం చేయడం వెనుక బీజేపీ ఏదైనా డైరెక్షన్ ఉందేమో?. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. అమిత్ షా డైరెక్షన్ లోనే పరిణామాలు జరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసే పనిలో టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. హరీష్ రాజకీయ నాయకుడా?, పెట్రోల్ పోసుకుని.. అగ్గిపెట్టే వెతికిన వాడు ఉద్యమకారుడా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

    భారతీయ జనతా పార్టీ మీద కూడా జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ మాట్లాడితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అంటున్నారని, ఆయన ఏ రోజైనా పాడుబడిన గుడికి వెళ్లి దీపం పెట్టారా? అని ప్రశ్నించారు. ‘అమిత్ షా కి అరేండ్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తుకు రాలేదు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తొచ్చారు. కేసీఆర్ ని జైల్లో పెట్టిస్తే బండి సంజయ్ హీరో ఐపోతారు. జైల్లో పెడతా అనే మాట బోర్ కొడుతుంది. జైల్లో ఎప్పుడు పెడతావో చెప్పు. మేయర్ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ముల్లా పంచాయతీ తేలిపోతుంది. తెలంగాణలో ప్రజల సమస్యల కంటే.. హిందు - ముస్లిం విద్వేషాలు నడుస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం గుంటనక్కల పార్టీలు.’ అని జగ్గారెడ్డి మండిపడ్డారు.    కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్య ఉండాలన్నదే ముఖ్యమన్నారు. ‘అరేళ్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. రైతుల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదు. గిరిజన, మైనారిటీలకు ఇస్తానని చెప్పిన రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆరోగ్య శ్రీ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. నిరుద్యోగ భృతి జాడ లేదు. బీజేపీ.. నిరుద్యోగ భృతి గురించి ఎందుకు అడగదు. రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదు?. టీఆర్ఎస్ మీద వ్యతిరేక ఓటు బీజేపీకి, బీజేపీ వ్యతిరేక ఓటు టీఆర్ఎస్‌కి వెళ్లేలా నాటకాలు ఆడుతున్నాయి.’ అని జగ్గారెడ్డి రెండు పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 21, 2021, 14:55 IST