మోదీకి ఆ వింత వ్యాధి... కాంగ్రెస్ నేత గూడురు నారాయణరెడ్డి విమర్శలు

రాహుల్ గాంధీ ప్రసంగాలకు దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత గూడురు నారాయణరెడ్డి అన్నారు. ఈ కారణంగానే మోదీ కొత్తగా బీసీ కార్డును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

news18-telugu
Updated: April 20, 2019, 1:54 PM IST
మోదీకి ఆ వింత వ్యాధి... కాంగ్రెస్ నేత గూడురు నారాయణరెడ్డి విమర్శలు
గూడూరు నారాయణరెడ్డి
news18-telugu
Updated: April 20, 2019, 1:54 PM IST
ప్రధాని నరేంద్రమోదీ పారనాయిడ్ పర్సనాలిటీ డిజాస్టర్ అనే వ్యాధితో బాధపడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి విమర్శించారు. గుజరాత్‌కు నాలుగుసార్లు సీఎంగా పని చేసినప్పటికీ చిన్నప్పుడు చాయ్ అమ్మిన జ్ఞాపకాలను ఇంకా మరిచిపోలేదన్నారు. అందుకే ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ చౌకీదార్ వంటి పదాలతో ఆ పదవిని కించపరుస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రసంగాలకు దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని అన్నారు. ఈ కారణంగానే మోదీ కొత్తగా బీసీ కార్డును తెరపైకి తెచ్చారని అన్నారు.

రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఇప్పటివరకు స్పందన లేదని గూడురు నారాయణరెడ్డి విమర్శించారు. జవాన్ల పేరుతో ఓట్లు అడుగుతున్న మోదీపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిపై చర్యలు తీసుకోవడాన్ని గూడురు నారాయణరెడ్డి తప్పుబట్టారు.


First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...