కాంగ్రెస్‌కు మరో షాక్... బీజేపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ?

తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ... కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే చర్చలు కూడా జరిపిందనే ప్రచారం సాగుతోంది.

news18-telugu
Updated: August 23, 2019, 5:35 PM IST
కాంగ్రెస్‌కు మరో షాక్... బీజేపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ?
దామోదర రాజనరసింహ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 23, 2019, 5:35 PM IST
కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ... బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నేటి రాత్రి హైదరాబాద్ వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాను దామోదర రాజనరసింహ కలవనున్నారని సమాచారం. తనకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుందనే భావనలో ఉన్న దామోదర... పార్టీ వీడతారనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆయన స్పందించడం లేదు.

తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ... దామోదరను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే చర్చలు కూడా జరిపిందనే ప్రచారం సాగుతోంది. 2014కు ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన దామోదర రాజనరసింహ...2014, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దామోదర రాజనరసింహ భార్య పద్మావతి బీజేపీలో చేరడం సంచలనం సృష్టించింది. అయితే అదే రోజు సాయంత్రం మళ్లీ ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.


First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...