ముఖేష్ గౌడ్ ఆరోగ్యం అత్యంత విషమం

ముఖేష్ గౌడ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.

news18-telugu
Updated: July 28, 2019, 10:58 PM IST
ముఖేష్ గౌడ్ ఆరోగ్యం అత్యంత విషమం
ముఖేష్ గౌడ్ (Image:Facebook)
  • Share this:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఈరోజు రాత్రి 9గంటల సమయంలో ఆయన్ను జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు అపోలో ఆస్పత్రి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్‌కు ఆయన సమీప బంధువు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ గౌడ్, రెండుసార్లు ఓడిపోయారు. 2014, 2019లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన సమయంలోనే ఆయన పూర్తిగా చిక్కి శల్యం అయిపోయి కనిపించారు.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>