Revanth reddy : ఇప్పటి వరకు ఒక లెక్క...ఇక నుండి మరో లెక్క...ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి

ఇంద్రవెల్లిలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

Revanth reddy : ఓరి సన్నాసి..నువ్వు ముఖ్యమంత్రి అయిన ఏడు సంవత్సరాల్లో గిరిజనుల కోసం ఒక్క రూపాయన్న ఖర్చుపెట్టావా అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్‌ను ఇంద్రవెల్లి సభ సాక్షిగా ప్రశ్నించారు..పేదలకు పైసా ఇవ్వని సీఎం కేసిఆర్ ఆయన కుటుంబాన్ని ధనవంతులను చేసి ,మద్యం తాగి ఫామ్ హౌజ్‌లో పడుకుంటున్నాడని దుయ్యబట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆయన చాప్టర్ క్లోజ్ చేస్తానని హెచ్చరించారు.

  • Share this:
    ఆదిలాబాద్‌ ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ చేపట్టిన కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అంత్యంత ఉత్సహాంగా కొనసాగింది. చాలా రోజుల తర్వాత పాత కొత్త నాయకులు పార్టీ వేదికపై ఆసీనులయ్యారు..మధ్యాహ్నం నుండే ప్రజలు పెద్ద ఎత్తున సభకు చేరుకున్నారు..దీంతో మధ్యాహ్నమే ప్రారంభించాల్సిన సభ సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగింది..

    అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసిఆర్‌ను టార్గెట్ చేస్తూ టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగింది. సుమారు ముప్పై నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం మొత్తం సీఎం కేసిఆర్ చేస్తున్న ఆరచాకాలతో పాటు ఆ పార్టీ వైఖరిపై విరుచుకుపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక కార్యక్రమాలను వివరించడంతో పాటు ఆదివాసి గిరిజనులకు చేసిన కార్యక్రమాలను ఆయన వివరించారు..

    కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వివరించిన రేవంత్ 

    ఈ నేపథ్యంలోనే దళితులు,గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కల్పించిన అనేక అవకాశాలను రేవంత్ రెడ్డి వివరించారు. రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెద్కర్ నుండి అనేక మందిని, దేశ అధ్యక్షులతో పాటు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాని టీఆర్ఎస్ పార్టీ మాత్రం దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అవినీతి పేరుతో పక్కన పెట్టిందని, కాని ఆయన చేసిన అవినీతి ఎంటో ఇప్పటివరకు బయటపెట్టలేదని అన్నారు. మరోవైపు ఒకప్పుడు ఆదిలాబాద్ పేరు చెబితే..ఒకప్పుడు పోరాట యోధుల పేరు గుర్తుకువచ్చేదని కాని ఇప్పుడు మాత్రం అవినీతి పరుల పేరు గుర్తుకువస్తుందని విమర్శించారు..

    ఇంద్రవెల్లి అమరులకు గుర్తింపు

    ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.. అమరులైన ప్రతి బిడ్డ పేరును భవిష్యత్ తరాలకు గుర్తుండేలా వారిపేరుతో స్థూపం నిర్మాణం చేస్తామని అన్నారు.

    ఇంటలీజన్స్ ఇంచార్జ్ ప్రభాకర్ రావును మోకాలిమీద కూర్చోపెడతా..

    కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సభకు రాకుండా అనేక ఇబ్బందులకు పోలీసులు గురి చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు..ఈ సంధర్బంగా పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం కేసిఆర్ విర్రవీగుతున్నాడని దుయ్యబట్టారు. అయితే ఇంటలీజన్స్ ఇంచార్జ్ విదేశాల్లో ఉన్నా...గుంజుకువచ్చి మోకాళ్ల మీద కూర్చోపెడతానని హెచ్చిరించారు..
    Published by:yveerash yveerash
    First published: