HOME »NEWS »POLITICS »telangana congress deeksha funny conversation between v hanumantha rao and janareddy ba

Janareddy vs VH: మీరు కాంగ్రెస్ కాదా?.. జానారెడ్డికి వీహెచ్ షాక్

Janareddy vs VH: మీరు కాంగ్రెస్ కాదా?.. జానారెడ్డికి వీహెచ్ షాక్
వీహెచ్, జానారెడ్డి (File)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు మధ్య సరదాతోపాటు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ పోరాడుతున్న రైతులకు మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు నేడు సంఘీభావ దీక్ష చేపట్టారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు మధ్య సరదాతోపాటు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ పోరాడుతున్న రైతులకు మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు నేడు సంఘీభావ దీక్ష చేపట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన దీక్షలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టికి నేతలు ఆర్థిన సాయం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు రూ.50వేలు, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రూ.40వేలు, వీ‌. హనుమంతరావు రూ. 5వేలు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం భట్టికి అందజేశారు. అలాగే విమలక్క సోదరుడు రూ. 2వేలు అందజేశారు. ఆ సమయంలో సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్ మధ్య చర్చ జరిగింది. దీక్షకు జానారెడ్డిని కూడా డబ్బులు అడిగారు వీహెచ్. అయితే, తన జేబులో ఎంత ఉంటే అంత తీసుకోవాలని సూచించారు జానారెడ్డి. వెంటనే జానారెడ్డి చొక్కా జేబులో చెయ్యి పెట్టిన వీహెచ్ రూ.10వేలు తీసుకున్నారు. మరో రూ.లక్ష ఇవ్వాలని కోరారు. ‘ఏం నువ్వు కాంగ్రెస్ కాదా? ఇంకో రూ.లక్ష ఇవ్వు.’ అని జానారెడ్డిని కోరారు వీహెచ్.

    కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాటం చేసిన పరంపరను కొనసాగించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడుతున్న సంఘాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు.



    ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాయడానికి వీల్లేని భాషలో కామెంట్లు చేశారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత శిఖండిలా మారిపోయారని, హస్తినలో ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ‘తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదు. రైతు బంధు ఒట్టి మోసం. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ పుడితే ఏంటి? పేదల బాధలు తెలిసిన మనిషి సోనియా గాంధీ. శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారు. మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టిన కేసీఆర్ వ్యవసాయ చట్టంపై యూ టర్న్ తీసుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతుకు మద్దతు ధర కల్పించింది. ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే‌‌.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది.’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 09, 2021, 14:52 IST

    टॉप स्टोरीज