నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. సోనియాతో భేటీ అయ్యే ఛాన్స్..

ఉపఎన్నిక ఫలితాలు,రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం. పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఉత్తమ్ పాల్గొంటారని తెలుస్తోంది.

news18-telugu
Updated: October 25, 2019, 5:57 AM IST
నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. సోనియాతో భేటీ అయ్యే ఛాన్స్..
రాహుల్ గాంధీతో ఉత్తమ్( File)
  • Share this:
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఢిల్లీ వెళ్తున్న ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉపఎన్నిక ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం. పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఉత్తమ్ పాల్గొంటారని తెలుస్తోంది. హుజూర్‌నగర్ ఫలితాలు వెలువడిన వెంటనే ఉత్తమ్ ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే, హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 113094 ఓట్లు పోల్ అయ్యాయి. 43,359 ఓట్ల రికార్డు మెజారిటీతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి 69736 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక టీడీపీ, బీజేపీలకు డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. ఆశ్చర్యంగా స్వతంత్ర అభ్యర్థి సుమన్‌కు బీజేపీ అభ్యర్థి కోట రామారావు (2638ఓట్లు) కంటే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. సుమన్‌కు మొత్తం 2697 ఓట్లు పోల్ అయ్యాయి.

First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com