హోమ్ /వార్తలు /రాజకీయం /

CM KCR: నా కన్నీళ్లు ఆగలేదు.. Rahul Gandhi పుట్టుకపై ఇంత నీచమా? -ఆ సీఎం బర్తరఫ్‌కు డిమాండ్

CM KCR: నా కన్నీళ్లు ఆగలేదు.. Rahul Gandhi పుట్టుకపై ఇంత నీచమా? -ఆ సీఎం బర్తరఫ్‌కు డిమాండ్

బీజేపీపై కేసీఆర్ ఫైర్

బీజేపీపై కేసీఆర్ ఫైర్

తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యర్థి అయినప్పటికీ రాహుల్ గాంధీపై బీజేపీ సీఎం అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. రాహుల్ గాంధీని బీజేపీ తిట్టినప్పుడు కన్నీళ్లు వచ్చాయని కేసీఆర్ చెప్పారు..

బీజేపీ, దాని నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై పోరును ఉధృతం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అంది వచ్చిన ప్రతి అంశాన్ని లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టుకపై అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యర్థి అయినప్పటికీ ఆ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ప్రముఖుడు చేసిన కామెంట్లను కేసీఆర్ తీవ్రస్వరంతో ఖండించారు. అంతేకాదు, రాహుల్ ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని, అలాంటి కుటుంబాన్ని ఇంత నీచంగా తిడతారా? అంటూ బీజేపీపై కేసీఆర్ ఫైరయ్యారు..

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు తెలంగాణ సీఎం కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ అంశాన్ని ప్రస్తావించారు. ‘రాహుల్‌ గాంధీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఓ విషయం నన్ను తీవ్రంగా బాధించింది. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి.. కేంద్రాన్ని ఏదో ప్రశ్న అడిగారు. దానిపై స్పందించిన బీజేపీ సీఎం.. నువ్వు ఎవరికి పుట్టావంటూ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు ఆగలేదు..’అని సీఎం ఎమోషనల్ అయ్యారు..

Cell Phone Driving: వాహనదారులకు గుడ్ న్యూస్ : సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇక నేరం కాదు.. షరతులివే: కేంద్రం


ప్రశ్నించిన వాళ్ల పుట్టుకలను ఎంచడమేనా మన సంప్రదాయం? ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా దీనికి ఏమని సమాదానం చెబుతారు? అని కేసీఆర్ నిలదీశారు. రాహుల్‌గాంధీ కుటుంబం దేశం కోసం అమరులయ్యారు.. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి ఇంత కుసంస్కారంగా మాట్లాడుతారా? అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అలా దిగజారి మాట్లాడవచ్చా? అంటూ ఫైర్‌ అయ్యారు కేసీఆర్.. ఇంత అహంకారమా..? కళ్లు నెత్తికెక్కాయా?’అని గులాబీ బాస్ ఫైరయ్యారు.

Uniform Civil Code: Hijab వివాదం వేళ BJP కీలక ప్రకటన -మళ్లీ గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి



ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించిన సభకు హాజరైన అస్సాం సీఎం హిమంత.. రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పాకిస్తాన్, చైనాతో సరిహద్దు వివాదాల విషయంలో మోదీ సర్కారు విధానాలను ఎండగడుతోన్న రాహుల్ గాంధీ.. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు ఆధారాలేవని అడుగుతున్నారని, ఆ మాటకొస్తే రాహుల్.. రాజీవ్‌ గాంధీకి పుట్టిన కొడుకా? కాదా? అని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని అస్సాం సీఎం హిమంత అన్నారు. జాతీయ స్థాయిలో అస్సాం సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాహుల్ కు మద్దతుగా అస్సాం సీఎంపై విరుచుకుపడటం గమనార్హం.

First published:

Tags: Assam, Bjp, CM KCR, Congress, Rahul Gandhi, Trs

ఉత్తమ కథలు