ఓడిపోయిన ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..

ఇంచార్జీలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికతో పాటు గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదేనని ఆయన స్పష్టంచేశారు.

news18-telugu
Updated: April 15, 2019, 7:38 PM IST
ఓడిపోయిన ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..
కేసీఆర్, తెలంగాణ సీఎం
news18-telugu
Updated: April 15, 2019, 7:38 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్..లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తోంది. ఐతే లోక్‌సభ ఫలితాలు వచ్చేలోపే మరో ఎన్నికలకు సిద్ధమవుతోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ దళం సమాయత్తమవుతోంది. సోమవారం తెలంగాణభవన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అవకాశం ఉన్న చోట ఓడిపోయిన ఎమ్మెల్యేకు పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేకు జడ్పీ ఛైర్మన్ పదవులను ప్రకటించారు కేసీఆర్. ఆదిలాబాద్ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కోవా లక్ష్మి, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్‌గా పుట్టా మధు పేర్లను సమావేశంలో ప్రకటించారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇంచార్జిలను నియమించారు తెలంగాణ సీఎం. పార్టీ ప్రధాన కార్యదర్శులకు కొన్ని జిల్లాల బాధ్యతల అప్పగించారు. ఇంచార్జీలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికతో పాటు గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదేనని ఆయన స్పష్టంచేశారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ దాదాపుగా షెడ్యూల్ ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం మూడు విడతల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 10,14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, రెండో విడత ఎన్నికలకు 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, మూడో విడుత ఎన్నికలకు 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని సమాచారం.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...