K Chandrashekar Rao: ఒకే నెలలో రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. గులాబీ బాస్ లెక్కేంటి ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: ఈ నెల మొదట్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోంమంత్రితో పాటు వివిధ మంత్రులతో భేటీ అయ్యారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. ఈ నెల మొదట్లో వారానికి పైగా హస్తినలో ఉండొచ్చని గులాబీ బాస్.. మరోసారి ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి ఏర్పాటు చేయనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇలాంటి సమావేశాలకు రాష్ట్రాల హోంమంత్రులు లేదా డీజీపీలు ఎక్కువగా హాజరవుతుంటారు. అందులోనూ సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇలాంటి సమావేశాలకు వెళ్లిన సందర్భాలు లేవు. అలాంటిది ఈసారి ఆయన ఒకే నెలలో రెండుసార్లు ఢిల్లీ వెళుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి వివిధ సమస్యలపై సీఎం కేసీఆర్ చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ తాజాగా ఎలాంటి వ్యూహంతో ఢిల్లీకి వెళుతున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో పలు రకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

    ఈ నెల మొదట్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోంమంత్రితో పాటు వివిధ మంత్రులతో భేటీ అయ్యారు. ఓ వైపు తెలంగాణలో తాము టీఆర్ఎస్‌తో రాజకీయంగా పోరాడుతుంటే.. ఢిల్లీ పెద్దలు బీజేపీ శ్రేణులను కన్ఫ్యూజ్ చేసే విధంగా సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులుగానే కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

    కానీ సీఎం కేసీఆర్ ఈ సమావేశాలను రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టే విధంగా వినియోగించుకుంటున్నారని.. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మెచ్చుకుంటోందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని బీజేపీ నేతలు మదనపడుతున్నారు. మరోసారి బీజేపీ శ్రేణులను ఈ రకమైన గందరగోళానికి గురి చేయడం కోసమే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.

    Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?

    ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ బయటకు తెలియని ఏదో రహస్య అజెండాతోనే ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్దివారాల క్రితం ఆయన చేపట్టిన ఢిల్లీ పర్యటనకు.. ప్రస్తుత పర్యటనకు ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి సాధారణంగా ఢిల్లీ పర్యటనలకు అంతగా ఆసక్తి చూపించని సీఎం కేసీఆర్.. ఒకే నెలలో రెండు సార్లు హస్తిన బాట పట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: