జగన్‌కు సడన్ సర్‌ప్రైజ్.. నేడు అమరావతికి కేసీఆర్..

ఈనెల 21న తెలంగాణలో నిర్వహించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు.

news18-telugu
Updated: June 17, 2019, 12:04 AM IST
జగన్‌కు సడన్ సర్‌ప్రైజ్.. నేడు అమరావతికి కేసీఆర్..
సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 17న అమరావతి వెళ్లనున్నారు. ఈనెల 21న తెలంగాణలో నిర్వహించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఇంద్రకీలాద్రి వెళ్తారు. 1.45 గంటలకు విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత 2.30 గంటలకు అమరావతిలోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. కేసీఆర్‌కు జగన్ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇద్దరూ కొద్దిసేపు చర్చలు జరుపుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి నియామక మహోత్సవానికి కేసీఆర్, జగన్ హాజరవుతారు.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>