కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వాలా ? వద్దా ? డైలమాలో కేసీఆర్

“కేసీఆర్ మరో ఆరు నెలల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు... ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతారు. ఏ పదవి ఉంటే ఏమిటి ? లేకుంటే ఏమిటి ? ” అని పార్టీకి చెందిన సీనియర్ నేతలే చెబుతున్నారు.

news18-telugu
Updated: January 11, 2019, 11:43 AM IST
కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వాలా ? వద్దా ? డైలమాలో కేసీఆర్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: January 11, 2019, 11:43 AM IST
మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ ముంఖ్యమంత్రి కేసీఆర్... తన కుమారుడి భవితవ్యంపై ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. భవిష్యత్తు నేతగా మార్చేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టినా... మంత్రి పదవి ఇవ్వాలా ? వద్దా ? అనే విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కేటీఆర్ రంగంలోకి దిగి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీపై తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటి తనంటే ఏమిటో మరోసారి నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నారు. “ఎవరైనా పార్టీ కిందే పని చేయాలి. పార్టీయే సుప్రీం” అని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ సమావేశంలో అన్నారు కేటీఆర్.

Telangana CM KCR undecided over trs working president KTR presence in cabinet  కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వాలా ? వద్దా ? ఆలోచనలో పడ్డ కేసీఆర్ “కేసీఆర్ మరో ఆరు నెలల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు... ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతారు. ఏ పదవి ఉంటే ఏమిటి ? లేకుంటే ఏమిటి ? ” అని పార్టీకి చెందిన సీనియర్ నేతలే చెబుతున్నారు.
కేటీఆర్, కేసీఆర్ ( ఫైల్ ఫోటో)


ఇంత వరకు బాగానే ఉన్నా... ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడిందని తెలుస్తోంది. పార్టీ ఆదేశానుసారం ప్రభుత్వం పని చేయాలి. కానీ... పార్టీ ప్రభుత్వం పని చేయలేదన్నది ప్రధానమైన అంశం. ఎంత వర్కింగ్ ప్రసిండెంట్‌గా ఉన్నా... మంత్రికి ఉన్న అధికారాలు ఆయనకు ఉండవు. తరుచూ మంత్రులతో కలవడం.. ప్రభుత్వపరమైన అంశాల్లో తలదూర్చడం వంటివి చేస్తే ఇబ్బంది తప్పదు. గతంలో వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు ఎధుర్కొన్నట్టుగానే కేటీఆర్‌ను కూడా రాజ్యాంగేతర శక్తి అనే విమర్శలు ఎదుర్కోక తప్పదు.

కేటీఆర్, హరీశ్ రావు ఫైల్ ఫోటో(Image:Facebook)
కేటీఆర్, హరీశ్ రావు ఫైల్ ఫోటో(Image:Facebook)
గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టే ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఇతర దేశాలు పర్యటించడం... ఆయా దేశాల్లో వ్యాపార దిగ్గజాలతో మాట్లాడటం వంటి కార్యక్రమాలు చేయగలిగారు. అంతే కాకుండా రాష్ట్ర మంత్రి హోదాలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కేటీఆర్ ఆంగ్లంలో ప్రసంగించిన తీరు యావత్ దేశాన్ని ఆకర్షించింది. అంతే కాకుండా... ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రినియర్ షిప్ సమ్మిట్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో కలిసి వేదిక పంచుకోవడం.. చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కేటీఆర్ ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించారు.

వీటితో పాటు వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పిలుపు మేరకు ఆయా దేశాల్లో పర్యటించి ప్రసంగించారు. మంత్రి హోదాలో ఇతర శాఖలకు సంబంధించిన సమీక్షలు కూడా నిర్వహించారు. ఇదంతా మంత్రి అనే హోదాలో మాత్రమే చేయగలిగారు. ఇప్పుడు ప్రభుత్వంలో చేరకుండా పార్టీకి మాత్రమే పరిమితమైతే కేటీఆర్ సెల్ఫ్ ఇమేజ్‌కు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కేటీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...