Home /News /politics /

TELANGANA CM KCR TO TARGET BJP WITH PADDY PROCUREMENT RELATED ISSUES AK

బీజేపీని టార్గెట్ చేసే విషయంలో KCR నయా ప్లాన్ ?.. వాళ్లకు క్లారిటీ ఇవ్వనున్నారా ?

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఫోకస్ చేయాలని పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా కేంద్రం వరి కొనకపోవడం వల్లే రైతులకు ఈ రకమైన సూచన చేయాల్సి వస్తుందనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది.

ఇంకా చదవండి ...
    బీజేపీ టార్గెట్‌గా తన వ్యూహాలకు మరింత పెడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణను టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ ప్రకటించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. దీంతో బీజేపీకి మళ్లీ ఒక్కసారిగా జోష్ వచ్చింది.

    ఇదే ఊపును కొనసాగిస్తూ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌పై రాజకీయం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన అధికార టీఆర్ఎస్.. ఈ విషయంలో కేంద్రం, బీజేపీ రైతులను మోసం చేస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. రైతులను పండించిన ధాన్యం మొత్తాన్ని కొంటామని కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తోంది.

    రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉందంటూ బీజేపీ నేతలు టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇక బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీంతో రాష్ట్రంలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా మారిపోయింది. అయితే ఈ అంశంలో బీజేపీని మరింతగా టార్గెట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. మంగళవారం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు పార్టీ ప్రకటించింది. దీంతో ఈ బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ఎక్కువగా వినియోగించబోతున్నారనే చర్చ జరుగుతోంది.

    రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

    Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

    రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఫోకస్ చేయాలని పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా కేంద్రం వరి కొనకపోవడం వల్లే రైతులకు ఈ రకమైన సూచన చేయాల్సి వస్తుందనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకత్వానికి ఏ రకమైన సూచనలు చేస్తారన్నది రేపు తెలియనుంది. చూస్తుంటే.. వరి కొనుగోలు అంశంపై తెలంగాణలోని అధికార టీఆర్ఎస్.. బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహాలను మరింత పదునునపెడుతున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు