Home /News /politics /

TELANGANA CM KCR TO STAY SILENT TILL COMPLETION ON UTTAR PRADESH ASSEMBLY ELECTIONS AK

K ChandraShekar Rao: అప్పటివరకు మౌనమే.. సీఎం కేసీఆర్ అలా డిసైడయ్యారా ?

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Politics: పరిస్థితులు అనుకూలిస్తే ఉత్తరప్రదేశ్ సమాజ్’వాదీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కూడా కేసీఆర్ లేదా కేటీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

  తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్నాయి. బీజేపీ రాజకీయంగా బలపడుతుంటంతో.. టీఆర్ఎస్ కూడా వ్యూహం మార్చింది. ఇప్పటివరకు బీజేపీని పెద్దగా పట్టించుకోని గులాబీ పార్టీ.. ఇప్పుడు మొత్తానికి మొత్తంగా బీజేపీ టార్గెట్‌గానే రాజకీయాలు చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత ఈ రకమైన పరిణామాలు మొదలయ్యాయి. ఇప్పుడు కేంద్రం, బీజేపీ లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... నెక్ట్స్ స్టెప్ ఏ రకంగా వేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇటీవల తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. కానీ అది రద్దయ్యింది. అయితే కేసీఆర్ మీడియా సమావేశం రద్దు కూడా వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది.

  కొంతకాలంగా జాతీయస్థాయిలోకి ఇతర పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ సమావేశాల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఆయా పార్టీల నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ముందుకు సాగేందుకు ఏ మేరకు అంగీకరించారన్నది తెలియరాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా, పోటీదారుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈసారి బీజేపీపై ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీదే పైచేయి అవుతుందనే నమ్మకం కూడా టీఆర్ఎస్‌లో ఉంది.

  పరిస్థితులు అనుకూలిస్తే ఉత్తరప్రదేశ్ సమాజ్’వాదీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కూడా కేసీఆర్ లేదా కేటీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు మౌనంగా ఉండటమే మేలు అని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూపీలో బీజేపీకి ఏ రకమైన ఫలితాలు వస్తాయో చూసిన తరువాత జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదిపే అంశంపై ముందుకు సాగాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.

  ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో.. ఫోకస్ అంతా కరోనా నియంత్రణ, పరిపాలన మీదే పెట్టాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో, దేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల గురించి సర్వేల ఆధారంగా సమాచారం తెచ్చుకోవడం కేసీఆర్‌కు బాగా అలవాటు.

  BJP Secret Meetings: అంతవరకు రాకుండానే జాగ్రత్తగా ఉంటున్న బీజేపీ ?.. అసలు కారణం అదేనా ?

  Jana Reddy: జానారెడ్డి ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా ?.. లైన్ క్లియర్ అయినట్టేనా ?

  ప్రస్తుతం యూపీ ఎన్నికల విషయంలోనూ ఆయన అదే పని చేస్తున్నారని.. అక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉండొచ్చనే దానిపై అధ్యయనం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీని కట్టడి చేసేందుకు కేసీఆర్ వేయబోయే తదుపరి వ్యూహం ఏమిటన్నది తెలియాలంటే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యే మార్చి వరకు ఆగాల్సిందేనేమో.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు