హోమ్ /వార్తలు /రాజకీయం /

హరీశ్‌రావుకు మరో పరీక్ష పెట్టనున్న కేసీఆర్...నిజమేనా ?

హరీశ్‌రావుకు మరో పరీక్ష పెట్టనున్న కేసీఆర్...నిజమేనా ?

కేసీఆర్‌తో హరీశ్‌రావు (file)

కేసీఆర్‌తో హరీశ్‌రావు (file)

లోక్ సభ ఎన్నికల సందర్భంగా హరీశ్‌రావకు కేసీఆర్ మరో పరీక్ష పెట్టనున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న రెండు లోక్ సభ స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను కేసీఆర్ హరీశ్ రావుకు అప్పగించబోతున్నారని సమాచారం.

ఇంకా చదవండి ...

  రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మేనల్లుడు హరీశ్ రావు ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ తగ్గించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో కేబినెట్ విస్తరణలో హరీశ్ రావుకు చోటు ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నా... అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే... లోక్ సభ ఎన్నికల సందర్భంగా హరీశ్‌రావకు కేసీఆర్ మరో పరీక్ష పెట్టనున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. తనతో పాటు హరీశ్ రావును ఎంపీగా పోటీ చేయించి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


  అయితే హరీశ్ రావుకు టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న రెండు లోక్ సభ స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను కేసీఆర్ అప్పగించబోతున్నారని ప్రచారం కూడా మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా తిరుగులేని మెజార్టీ సాధించిన టీఆర్ఎస్... ఖమ్మం జిల్లాలో మాత్రం చతికలపడింది. ఇక నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నా... ఇప్పటికీ నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ బలంగానే ఉంది. దీనికి తోడు లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.


  ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యతలను కేసీఆర్ హరీశ్ రావుకు అప్పగించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న స్థానాల్లోనూ టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ రావు... కేసీఆర్ అప్పగించాలనుకుంటున్న బాధ్యతలను స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి లోక్ సభ ఎన్నికల్లో హరీశ్ రావు పాత్ర ఏ రకంగా ఉంటుందన్న అంశంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులుగా వెయిట్ చేయాల్సిందే.

  First published:

  Tags: CM KCR, Congress, Harish Rao, Khammam, KTR, Nalgonda, Telangana, Trs

  ఉత్తమ కథలు