Home /News /politics /

TELANGANA CM KCR TO PROTEST AGAINST CENTRE REGARDING PADDY PROCUREMENT IN NEW DELHI ON NOVEMBER 29 AK

Telangana: కేంద్రంతో పోరాటానికి సిద్ధమైన కేసీఆర్.. ఢిల్లీలో దీక్ష ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: రాబోయే రోజుల్లో కేంద్రం వరి కోనుగోలు చేయకపోవడంపై నిరసనలు తెలుపుతూనే ఉండాలని భావిస్తున్న టీఆర్ఎస్.. దీనిపై ఢిల్లీలోనూ నిరసన కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు తరువాత తెలంగాణ రాజకీయాల్లో మరింత బలం పుంజుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంటే.. ఆ పార్టీ వ్యూహాలను దెబ్బకొట్టేందుకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో పండిస్తున్న వరిని కేంద్రం కొనుగోలు చేస్తుందా ? లేదా ? అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ, కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్.. ఈ అంశంపైనే ఆ పార్టీని టార్గెట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో వరి కొనుగోలు అంశంపై బీజేపీ, కేంద్రం తీరును నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్.. తాజాగా ఈ పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలనే ప్లాన్ చేస్తోంది. నేడు టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. ఈ భేటీలో ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారని వార్తలు వినిస్తున్నాయి.

    రాబోయే రోజుల్లో కేంద్రం వరి కోనుగోలు చేయకపోవడంపై నిరసనలు తెలుపుతూనే ఉండాలని భావిస్తున్న టీఆర్ఎస్.. దీనిపై ఢిల్లీలోనూ నిరసన కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 29న దీక్షా దీవస్ రోజే ఢిల్లీలో ఇందుకు సంబంధించి దీక్ష చేపట్టాలని.. ఈ దీక్షలో స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజే వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసిన భారీ బహిరంగ సభను రద్దు చేసుకుని.. ఢిల్లీలో ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది.

    నిజానికి సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో.. వరి కొనుగోలు అంశంపై నిరసనలు తెలిపే విషయంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఇదే అజెండాతో సమావేశం ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వడంతో.. ఈ విషయంలో కేసీఆర్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంతో రాష్ట్ర స్థాయిలో నిరసనలు, పోరాటలు చేయడంతో పాటు జాతీయ స్థాయిలోనూ తమ నిరసన గళం వినిపించాలనే యోచనలో టీఆర్ఎస్ ఉందని.. అలా చేయడం ద్వారా కేంద్రం, బీజేపీ మరింత ఇరకాటంలో పడుతుందని గులాబీ బాస్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

    రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

    Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

    రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడకుండా ఉండేందుకు ఈ అంశం ఎంతో కలిసొస్తుందనే యోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని.. ప్రస్తుతం ఉన్న తరుణంలో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఇంతకంటే బలమైన అంశం మరొకటి లేదనే యోచనలో తెలంగాణ అధికార పార్టీ ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Delhi, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు