తెలంగాణలోని ఆర్టీసీ సమ్మె 25వ రోజుకు చేరింది. బస్సులు లేక.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవార, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై కేబినెట్ భేటీ నిర్వహించి దీనికి ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మెపై ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికల్-2019 ప్రకారం ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లభించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని మూడు నుంచి నాలుగువేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తే ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు దోహదపడతుందని భావిస్తోంది.అయితే పర్మిట్లు వస్తే నడపడానికి మరోవైపు ప్రైవేటు యజమానులు సైతం సిద్ధంగా ఉన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:October 29, 2019, 10:35 IST