KCR: మాజీమంత్రికి కేసీఆర్ కీలక పదవి.. సమీక్షలో సీఎం పక్కనే సీటు.. దళితబంధులో ఆయనే కీలకం కాబోతున్నారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Motkupalli Narasimhulu: ఎస్సీ వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. ప్రత్యర్థులపై తనదైన స్టయిల్లో విమర్శలు గుప్పించడంలో మోత్కుపల్లి నర్సింహులు దూకుడుగా ముందుకు సాగుతుంటారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరుకావడం.. అందులోనూ ఆయన సీఎం కేసీఆర్ పక్కన కూర్చోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన మోత్కుపల్లి నర్సింహులు.. కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరని మోత్కుపల్లి నర్సింహులు ఈ రకమైన ప్రకటన చేయడంతో.. ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని అంతా భావించారు.

    అయితే ఆయన టీఆర్ఎస్‌లో చేరితే ఏ రకమైన పదవి వస్తుందో అనే చర్చ కూడా సాగింది. సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులకు కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లి నర్సింహులును చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు ఊతమిచ్చే విధంగా మోత్కుపల్లి నర్సింహులు ఈ రోజు సీఎం కేసీఆర్ నిర్వహించిన దళితబంధు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

    సమీక్షకు హాజరుకావడమే కాదు.. స్వయంగా ఈ భేటీలో సీఎం కేసీఆర్ పక్కన సీటులోనే కూర్చుకున్నారు మోత్కుపల్లి. దీంతో ఆయనకు కీలకమైన పదవి దాదాపుగా ఖాయమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పదవికి సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులును ఎంచుకోవడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరించాలనే టాక్ వినిపిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. ప్రత్యర్థులపై తనదైన స్టయిల్లో విమర్శలు గుప్పించడంలో మోత్కుపల్లి నర్సింహులు దూకుడుగా ముందుకు సాగుతుంటారు.

    EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

    Money Transfer to Wrong Account: పొరపాటుగా వేరే అకౌంట్‌కు వెళ్లిన డబ్బును తిరిగి పొందవచ్చా ?.. అందుకు ఏం చేయాలి ?

    గతంలో టీడీపీలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌ను ఆయన అనేక సందర్భాల్లో గట్టిగా విమర్శించారు. మిగతా నాయకులకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్.. అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఎదుర్కోవడంతో మాత్రం ఇబ్బందిపడిందనే వాదన ఉంది. అలాంటి మోత్కుపల్లికి దళితబంధు అమలుకు సంబంధించిన కీలక పదవి ఇవ్వడం ద్వారా.. ఆయన ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళతారని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజకీయంగా మరోసారి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మోత్కుపల్లి నర్సింహులుకు టీఆర్ఎస్ అధినేత కీలక పదవి ఎప్పుడు కట్టబెడతారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: