తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో రాజ్‌భవన్ వెళ్లనున్నారు. గవర్నర్ నరసింహన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్‌ను నియంమించిన నేపథ్యంలో నరసింహన్‌తో భేటీ అవుతున్నారు కేసీఆర్. కాగా, నరసింహన్ సుదీర్ఘ కాలంగా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. 9 ఏళ్ల 9 నెలలుగా ఆయన గవర్నర్ పదవిలో ఉన్నారు. త్వరలోనే ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు తమిళిసై.