Home /News /politics /

TELANGANA CM KCR TO MEET DMK CHIEF STALIN TODAY SB

తమిళనాడులో సీఎం కేసీఆర్... సాయంత్రం స్టాలిన్‌తో సమావేశం

డీఎంకె అధినేత స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

డీఎంకె అధినేత స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

కేసీఆర్ ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్‌తోనూ సమావేశమయ్యారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచారు. ఇందులో భాగంగానే.. ఆయన ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ఆ రాష్ట్రంలోని శ్రీరంగం,తిరుచ్చి ఆలయాలను దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. తమిళనాడు పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రమే కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నైకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా మద్దతు కూడగట్టడం కోసం కేసీఆర్ స్టాలిన్‌ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ఐదు రోజుల తన పర్యటనలో ఇందుకు ముహూర్తం సైతం కుదిరింది. కానీ చివరి నిమిషంలో వీరిరువురి భేటీ రద్దైనట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే స్టాలిన్ కాంగ్రెస్ కూటమితో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కేసీఆర్‌తో భేటీ అయితే తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశాలున్నాయి కాబట్టి స్టాలిన్ ఈ భేటీని రద్దు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ కేసీఆర్ సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తూండటంతో వీరిరువురి భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

    ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కేసీఆర్ డీఎంకే అధినేతకు వివరించనున్నారు. కేంద్రంలో ఏ జాతీయ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, కాబట్టి ప్రాంతీయ పార్టీలు సాధించే స్థానాలే కీలకం కానున్నాయని కేసీఆర్ తెలుపనున్నారు. కేసీఆర్ ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్‌తోనూ సమావేశమయ్యారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడారు. ఇతర పక్షాల నేతలతో టచ్‌లో ఉన్నారు గులాబీ బాస్.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: CM KCR, DMK, MK Stalin, Tamil nadu Politics, Tamilnadu, Telangana Government, Telangana News, Telangana Politics

    తదుపరి వార్తలు