Home /News /politics /

TELANGANA CM KCR TO MAKE KEY STATEMENT IN ASSEMBLY ON TOMORROW 10 AM REGARDING JOB NOTIFICATIONS AK

CM KCR: రేపు 10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో.. నిరుద్యోగ సోదరుల కోసం ఏం చేయబోతున్నామనే దానిపై రేపు 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలిపారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా నాగవరం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో.. నిరుద్యోగ సోదరుల కోసం ఏం చేయబోతున్నామనే దానిపై రేపు 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలిపారు. నిరుద్యోగ సోదరులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బహిరంగ సభలో అనేక అంశాలపై మాట్లాడిన సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి రేపు అసెంబ్లీలో(Telangana Assembly) కీలక ప్రకటన చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రేపు ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా ? అనే ఉత్కంఠ రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల్లో నెలకొంది.

    టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో అలసత్వం వహిస్తోందని కొంతకాలంగా కాంగ్రెస్, బీజేపీ ఇతర విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ అంశంపై పోరాటాలు చేస్తున్నాయి. ఉద్యోగాలను భర్తీ చేస్తామని కొంతకాలంగా చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. కొత్త జోన్ల విధానం తేలడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల లెక్క తేలిన తరువాత వాటి భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు(Job Notifications) వేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన ఎఫ్పుడు చేస్తుందన్న దానిపై నిరుద్యోగులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలోనే క్లారిటీ ఇస్తుందని చాలామంది భావించారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటైన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో పలు సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం... నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని ఈ అంశంపై ప్రశ్నించాలని సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీలో 10 గంటలకు ప్రకటన చేయబోతున్నానని.. నిరుద్యోగులంతా రేపు టీవీ చూడాలని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.

    CM KCR : ఉపాధ్యాయులకు సీఎం శుభవార్త.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్..

    Telangana Politics: బీజేపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చిన కేసీఆర్.. అసలు కారణం ఇదేనా ?

    ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేస్తారా ? లేక రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే దానిపై ప్రకటన చేస్తారా ? అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్.. అంతకుముందు ఇదే అంశంపై కేంద్రం ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే దానిపై కూడా సీఎం కేసీఆర్ లెక్కలు ప్రకటించే అవకాశం లేకపోలేదని సమాచారం. మొత్తానికి రేపు అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు