Home /News /politics /

TELANGANA CM KCR TO HIT TWO BIRDS WITH ONE SHOT ONE IS THE BJP AND THE OTHER IS THE ALTERNATE CROP CULTIVATION AK

KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయనున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్.. అసలు ఏ లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    తెలంగాణలో ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం నడుస్తోంది. కేంద్రం వరి కొనుగోళ్ల విషయంలో వివక్ష చూపుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. ఈ అంశంపై కేంద్రం తీరుకు నిరసనగా పలు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా కేంద్రం వైఖరి మారడం లేదని పేర్కొన్న సీఎం కేసీఆర్.. యాసంగిలో తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని స్పష్టం చేసిన నేపథ్యంలో.. యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, బీజేపీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు ఈ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని.. కేంద్రం తీరును ప్రశ్నించాలని సీఎం కేసీఆర్ పదే పదే తన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

    అయితే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయనున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్.. అసలు ఏ లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రాజకీయంగా బలపడుతున్నట్టు కనిపిస్తున్న బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. రైతులకు అనుకూలంగా తాము అనేక నిర్ణయాలు తీసుకుంటుంటే.. కేంద్రం, బీజేపీ మాత్రం రైతులను ముంచే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు.

    కేవలం ఈ రకమైన ఆరోపణలు చేస్తే సరిపోదని భావించిన కేసీఆర్.. సమయం చూసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసేస్తామని ప్రకటించడం ద్వారా రైతుల బీజేపీని టార్గెట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ వేసిన ఎత్తుగడను బీజేపీ ఏ రకంగా ఎదుర్కొంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఈ నిర్ణయం వెనుక కేసీఆర్ మరో ప్లాన్ కూడా ఉందనే చర్చ జరుగుతోంది. గతంలోనే రైతులు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ నియంతృత్వపు సాగు విధానం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందుకు సంబంధించి ప్రకటనలు కూడా చేసింది.

    Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

    KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

    Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

    Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

    అయితే ఈ విషయంలో విపక్షాలు, రైతుల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో.. మళ్లీ వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ద్వారా రైతులు తమంతట తాముగా ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడిపై దృష్టి పెడతారని కేసీఆర్ సర్కార్ భావించి ఉండొచ్చనే భావన కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. తన నిర్ణయంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు