కేసీఆర్ మహారాష్ట్ర ప్లాన్... బీజేపీ కోసమేనా ?

తెలంగాణ రాజకీయాల్లో తనను ఇబ్బందిపెడుతున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

news18-telugu
Updated: September 18, 2019, 11:34 AM IST
కేసీఆర్ మహారాష్ట్ర ప్లాన్... బీజేపీ కోసమేనా ?
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైందనే విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న తరువాత... బీజేపీ గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. గట్టిగా పోరాడితే తెలంగాణలోనూ తమకు అధికారం దక్కుతుందనే భావనలో ఉన్న బీజేపీ... టీఆర్ఎస్ టార్గెట్‌గా తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ కారణంగానే ఒకప్పుడు ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగించిన సీఎం కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో తనను ఇబ్బందిపెడుతున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. బీజేపీకి ఎంతో కీలకమైన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు కేసీఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని లేకపోతే అక్కడ టీఆర్ఎస్‌ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ నేతలు కేసీఆర్‌ను కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు గులాబీ బాస్‌ కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం.

అయితే మహారాష్ట్ర ప్రాంత నేతలు సీఎం కేసీఆర్‌ను కలవడం సహజంగానే జరిగిందా లేక ఇది టీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అక్కడ బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా... మహారాష్టలో టీఆర్ఎస్ పోటీ అనేది బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ రాజకీయ వ్యూహమా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.




First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading