మోదీ ఆ మాట బంద్ చెయ్యాలే.. అమిత్ షా ఆటిట్యూడ్ మారాలె : కేసీఆర్

తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని.. కొత్తగా మతం పుచ్చుకున్నోడికి నామాలు ఎక్కువ అన్న చందంగా వారి హడావుడి ఉందని ఎద్దేవా చేశారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీనే గనుక వస్తే రాష్ట్రం ఆగమవుతుందన్నారు.

news18-telugu
Updated: September 22, 2019, 1:11 PM IST
మోదీ ఆ మాట బంద్ చెయ్యాలే.. అమిత్ షా ఆటిట్యూడ్ మారాలె : కేసీఆర్
సీఎం కేసీఆర్
  • Share this:
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతీసారి.. 'తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడుతున్నారు' అంటూ కేసీఆర్ మండిపడ్డారు.మోదీ ఇకనైనా ఆ మాట బంద్ చేయాలన్నారు. అలాగే అమిత్ షా కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ మాట్లాడుతున్నారని.. ఆయన కూడా తన ఆటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. మాట్లాడితే బీజేపీ నాయకులు.. ఇక తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామని మాట్లాడుతున్నారని.. కొత్తగా మతం పుచ్చుకున్నోడికి నామాలు ఎక్కువ అన్న చందంగా వారి హడావుడి ఉందని ఎద్దేవా చేశారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీనే గనుక వస్తే రాష్ట్రం ఆగమవుతుందన్నారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల స్థానంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుచేస్తారని.. వాటివల్ల ప్రజలకు ఒరిగేదేమి ఉండదని అన్నారు.ఆరోగ్య శ్రీ పథకం స్థానంలో ఆయుష్మాన్ భారత్,రైతు బంధు స్థానంలో కిసాన్ సమ్మాన్ తీసుకొస్తారని చెప్పారు. రైతు బంధు పథకం కింద తాము ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నామని,కిసాన్ సమ్మాన్ పథకం కింద ఎన్ని ఎకరాలున్నా ఏడాదికి రూ.6వేలు మాత్రమే ఇస్తారని చెప్పారు. అలాగే రైతు భీమా కింద తాము ప్రతీ రైతుకు రూ.5లక్షల భీమా ఇస్తున్నామని,కేంద్ర ప్రభుత్వ భీమా పథకంతో రైతు కుటుంబాలకు ఎక్కువ లబ్ది చేకూరదని అన్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ పరిధిలో ఉన్న ధర్మాబాద్ చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు వచ్చి తమను కలిశారని చెప్పారు. రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో వారంతా టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారని.. దీన్ని బట్టి బీజేపీ పాలన బాగుందో.. టీఆర్ఎస్ పాలన బాగుందో తెలుసుకోవాలని కోరారు. కాంగ్రెస్,బీజేపీ దొందూ దొందే అని.. వీరి వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల వల్లే దేశంలో పేదరికం పెరిగిపోయిందన్నారు.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading