హుజూర్‌నగర్ ఉపఎన్నిక.. బీజేపీపై కేసీఆర్ సెటైర్స్

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎన్నికలకు ముందు అక్కడి సభకు హాజరుకాలేకపోయానని.. శనివారం అక్కడ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

news18-telugu
Updated: October 24, 2019, 4:50 PM IST
హుజూర్‌నగర్ ఉపఎన్నిక.. బీజేపీపై కేసీఆర్ సెటైర్స్
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావడంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేపీ పెడబొబ్బలకి.. వాళ్లకు వచ్చిన ఓట్లకు సంబంధం లేదన్నారు. బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే నవ్వాలో ఏడవాలో వాళ్లకే అర్థం కావడం లేదని సెటైర్స్ వేశారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరమేనని.. కానీ లేనిపోని అపనిందలు వేయడం సబబు కాదన్నారు. ప్రతిపక్షాలు అహంభావం,అహంకారంతో వ్యవహరించడం సరికాదన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలతో తమపై బాధ్యత మరింత పెరిగిందని.. మరింత సంస్కారంతో పనిచేయాల్సిందిగా టీఆర్ఎస్ శ్రేణులకు సూచిస్తామని తెలిపారు.హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎన్నికలకు ముందు అక్కడి సభకు హాజరుకాలేకపోయానని.. శనివారం అక్కడ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.సభకు అనుమతి రాగానే అధికారికంగా సభ వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. హుజూర్‌నగర్ గెలుపు టీఆర్ఎస్‌కు టానిక్‌లా పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఇకనైనా పంథా మార్చుకోవాలని.. రాజకీయాల కోసం పచ్చి అబద్దాలు చెబుతామంటే కుదరదని చెప్పారు.
Published by: Srinivas Mittapalli
First published: October 24, 2019, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading