హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీ రాజధానులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

ఏపీ రాజధానులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్

తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ 3 రాజధానుల ఫార్ములాకు సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు.. రాజధానుల నిర్ణయంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను కూడా జగన్‌కు చెప్పినట్లు సమాచారం.

మొత్తంగా ఆరు గంటల పాటు సమావేశం.. అందులో రెండు గంటల పాటు ఏకాంతంగా భేటీ.. అసలు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ దేని గురించి చర్చించారు? రాజధాని ప్రస్తావన వీరిద్దరి మధ్య వచ్చిందా? మూడు రాజధానులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమన్నారు? జగన్ తీసుకుంటున్న నిర్ణయానికి ఓకే చెప్పారా? అంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ 3 రాజధానుల ఫార్ములాకు సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు.. రాజధానుల నిర్ణయంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను కూడా జగన్‌కు చెప్పినట్లు సమాచారం. తాను తీసుకుంటున్న ఈ నిర్ణయంపై సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి.. తదితర అంశాలను కేసీఆర్‌కు జగన్ పూర్తిగా వివరించినట్లు సమాచారం.

కాగా, అమరావతిలో రైతుల ఆందోళనపై కేసీఆర్ ప్రశ్నిస్తూనే, జాగ్రత్తగా ఉండాలని సూచించగా.. అదేమీ పెద్ద సమస్య కాదని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. మూడు రాజధానుల నిర్ణయానికి కేసీఆర్ మద్దతు ఇవ్వడంతో జగన్ ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కేసీఆర్, జగన్ భేటీ కావడం ఇది నాలుగో సారి. భేటీ అయిన ప్రతీ సారి ఇరు రాష్ట్రాల సమస్యలు, విభజన సమస్యలు, జలాల పంపిణీ గురించి చర్చిస్తూ వస్తున్నారు. తాజాగా.. వీరిద్దరు భేటీ కావడంపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. రాజధానుల అంశంపైనే చర్చిస్తారేమోనని అనుకున్నారు. అనుకున్నట్లుగానే వీరిద్దరు చర్చించుకున్నట్లు సమాచారం అందడం గమనార్హం.

First published:

Tags: Amaravati, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, CM KCR, Telangana News, Visakhapatnam

ఉత్తమ కథలు