కృతజ్ఞత సభ.. హుజూర్‌నగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు

KCR Huzurnagar Public Meeting : హుజూర్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్దికి రూ.25కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే నేరెడుచర్ల మున్సిపాలిటీ అభివృద్దికి రూ.15కోట్లు మంజూరు చేస్తామన్నారు.

news18-telugu
Updated: October 26, 2019, 6:22 PM IST
కృతజ్ఞత సభ.. హుజూర్‌నగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సీఎం కేసీఆర్
  • Share this:
ఎన్నో అపోహలు.. అనుమానాలు.. అపవాదులను హుజూర్‌నగర్ ఉపఎన్నిక పటాపంచలు చేసిందన్నారు సీఎం కేసీఆర్. శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌పై సీఎం వరాల జల్లు కురిపించారు. హుజూర్‌నగర్ పరిధిలో ఉన్న 131 గ్రామ పంచాయతీలకు.. ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్దికి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హుజూర్‌నగర్ పరిధిలోని 7 మండల కేంద్రాలకు రూ.30లక్షలు మంజూరు చేస్తామన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్దికి రూ.25కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే నేరెడుచర్ల మున్సిపాలిటీ అభివృద్దికి రూ.15కోట్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలోనే వీటికి సంబంధించిన జీవోలు విడుదల చేస్తామన్నారు.

అలాగే చాలాకాలంగా ఉన్న హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్‌ డిమాండ్‌ను నెరవేరుస్తామని.. త్వరలోనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హుజూర్‌నగర్ పట్టణంలో పాలిటెక్నిక్ కాలేజీతో పాటు బంజారా భవనం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల,ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. హుజూర్‌నగర్‌లో కోర్టు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రజా దర్బార్ పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక సంక్షేమ అభివృద్ది పథకాల గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అన్ని రంగాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కల్యాణలక్ష్మీ,షాదీ ముబాకర్,రైతు బంధు,రైతు భీమా,మిషన్ భగీరథ,కేసీఆర్ కిట్ వంటి అద్భుత పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్నివర్గాలను ఆదుకునే విధంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని.. కొంతమంది దీన్ని ఓర్వలేక అసంబద్ద ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివాళ్లందరికీ హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి విజయం

చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగం ముగించారు.

First published: October 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...