• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TELANGANA CM KCR SPEECH FROM GOLCONDA FORT AFTER FLAG HOIST IN GOLKONDA KOTA MS

గ్రామాల కోసం త్వరలో 60 రోజుల కార్యాచరణ : గోల్కొండ కోటలో కేసీఆర్

సీఎం కేసీఆర్

KCR Flag Hoists at Golkonda Fort : స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని.. అందుకోసం జిల్లా గ్రీన్ కమిటీ సూచనలను పాటించాలని చెప్పారు. పట్టణ,గ్రామ బడ్జెట్‌లో పచ్చదనం కోసం నిధులు కేటాయించాలన్నారు.

  • Share this:
    రాబోయే తరానికి ఆస్తిపాస్తులు ఇస్తే సరిపోవని.. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన కర్తవ్యం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాలు,పట్టణాల అభివృద్ది కోసం త్వరలోనే 60 రోజుల కార్యాచరణ తీసుకొస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి దశలో గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వబోతున్నామని తెలిపారు. సమగ్ర చెత్త నిర్మూలనతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతామన్నారు. విద్యుత్ సమసలన్నీ పరిష్కరించేలా 'పవర్ వీక్' ఏర్పాటు చేస్తామన్నారు. వంగిన కరెంట్ పోల్స్‌ను సరిచేయడం.. తుప్పు పట్టినవాటిని సరిచేయడం,వేలాడే వైర్లను సరిచేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. పవర్ వీక్‌లో విద్యుత్ శాఖ అధికారులంతా గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని సూచించారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

    స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని.. అందుకోసం జిల్లా గ్రీన్ కమిటీ సూచనలను పాటించాలని చెప్పారు. పట్టణ,గ్రామ బడ్జెట్‌లో పచ్చదనం కోసం నిధులు కేటాయించాలన్నారు.ప్రతీ ఇంటికి ప్రజలు కోరుకునే ఆరు మొక్కలు సరఫరా చేయాలని చెప్పారు. పంచవర్షిక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాలని.. వాటికి గ్రామ సభల ఆమోదం తప్పనిసరి అని అన్నారు. తద్వారా గ్రామీణాభివృద్ది సాధ్యపడుతుందన్నారు.పరిపాలనా సంస్కరణలతోనే మెరుగైన పాలన సాధ్యమని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకే అందుకే కొత్త పంచాయతీరాజ్ చట్టం,కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చామన్నారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా రూపొందిస్తున్నామని చెప్పారు.
    First published: