సీఎం కేసీఆర్ ఇంట విషాదం

మంత్రులు కేటీఆర్ , హరిశరావు రాజేశ్వర్ రావు గారి పార్థీవదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

news18-telugu
Updated: February 8, 2020, 3:29 PM IST
సీఎం కేసీఆర్ ఇంట విషాదం
కేేసీఆర్ సోదరి భర్త మృతి
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండువ సోదరి భర్త అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల వాస్తవ్యులు పర్వతనేని రాజేశ్వర్ రావు గారి వయసు 84 ఏళ్లు. అనారోగ్యంతో ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో మంత్రులు కేటీఆర్ , హరిశరావు  రాజేశ్వర్ రావు గారి పార్థీవదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ తల్లిదండ్రుల స్వగ్రామం మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామం. కేసీఆర్‌కు 8మంది అక్కలు, ఓ అన్నా చెల్లెలుకూడా ఉన్నారు. గతేడాది కూడా కేసీఆర్ సోదరి ఒకరు అనారోగ్య కారణాలతో చనిపోయారు. వారి తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటమ్మ. కేసీఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది.First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు