హోమ్ /వార్తలు /National రాజకీయం /

పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్

పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్

Telangana elections 2018 | పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంగా ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకొని మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...

    పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు వెంటనే కార్యదర్శులను నియమించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈనెల 27న ఎల్బీ స్టేడియంలో పంచాయతీరాజ్ అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న 9355 గ్రామకార్యదర్శులతో పాటు కొత్తగా నియమితులయ్యేవారితో కలిపి మొత్తం 12751 గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఇవోపిఆర్డిలు, డిపిఓలు, డిఎల్పీఓలు ఈ సదస్సులో పాల్గొనాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సదస్సులో స్వాగతోపన్యాసం చేయనున్నారు. గ్రామాల అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు.

    ఇక, చాలా రోజులుగా ఎటూ తేలకుండా ఉన్న పంచాయతీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంగా ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకొని మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే, పెరిగిన బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం గతంలో భావించింది. 64 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే దీనిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో.. ఎన్నికలు వాయిదాపడుతూ వచ్చాయి. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని న్యాయస్థానాలు స్పష్టం చేయడంతో.. అందుకు తగినట్టే చట్టసవరణ చేసింది ప్రభుత్వం. అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతంగా ఉండేలా చట్టసవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

    First published:

    Tags: CM KCR, High Court, Supreme Court, Telangana, Telangana Election 2018, Telangana News

    ఉత్తమ కథలు