• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA CM KCR PUT ANOTHER TEST FOR MINISTER HARISH RAO IN MLC ELECTIONS AK

KCR-Harish Rao: హరీశ్ రావుకు మరో పరీక్ష పెట్టిన కేసీఆర్.. దుబ్బాక మచ్చ చెరిపేసుకుంటారా ?

KCR-Harish Rao: హరీశ్ రావుకు మరో పరీక్ష పెట్టిన కేసీఆర్.. దుబ్బాక మచ్చ చెరిపేసుకుంటారా ?

హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

Harish Rao: ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లను టీఆర్ఎస్ వైపు ఆకర్షించే బాధ్యత హరీశ్ రావుపై పడింది.

  • Share this:
    టీఆర్ఎస్‌ ముఖ్యనేత హరీశ్ రావు రాజకీయ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న హరీశ్ రావు.. పొలిటికల్ మేనేజ్‌మెంట్ విషయంలో దిట్ట అనే పేరుంది. అందుకు తగ్గట్టుగా తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ ఉప ఎన్నికలకు వెళ్లిన చాలా సందర్భాల్లో తాను ఘన విజయం సాధించడంతో పాటు తనకు గెలుపు బాధ్యత అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించడంతో హరీశ్ రావు సూపర్ సక్సెస్ సాధించారు. అలా టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. హరీశ్ రావు ఎంట్రీ ఇస్తే.. అక్కడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమనేలా గుర్తింపు సాధించారు. అయితే అలాంటి హరీశ్ రావుకు గతేడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. తన సొంత జిల్లా, అందులోనూ తన పక్క నియోజకవర్గమైన దుబ్బాకలో టీఆర్ఎస్‌ను గెలిపించడంలో హరీశ్ రావు సక్సెస్ కాలేకపోయారనే అపవాదు మోయాల్సి వచ్చింది. అందులోనూ అక్కడ బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్‌కు మరింత ఇబ్బంది కలిగించింది.

    అయితే దుబ్బాక తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు గెలుపు బాధ్యత అప్పగించిన డివిజన్‌లో పార్టీని గెలిపించిన హరీశ్ రావు... ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు బాధ్యత తీసుకున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. దీంతో ఈ జిల్లా నుంచి టీఆర్ఎస్‌కు మెజార్టీ ఓట్లు సాధించడం ఎలా అనే అంశంపై హరీశ్ రావు ఫోకస్ పెట్టారు.

    గతంలో ఈ సీటు బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఇక్కడ ఎక్కువ ఓట్లు రాబట్టడంపై హరీశ్ రావు తనదైన శైలిలో మంత్రాంగం నడపాల్సి ఉంటుంది. అందులోనూ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లను టీఆర్ఎస్ వైపు ఆకర్షించే బాధ్యత హరీశ్ రావుపై పడింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు మెజార్టీ ఓట్లు సాధించడం ద్వారా దుబ్బాక ఓటమిలో తన వైఫల్యం ఎంతమాత్రం లేదనే విషయాన్ని చాటిచెప్పాలనే భావనలో హరీశ్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తనకు కేసీఆర్ పెట్టిన ఈ కొత్త పరీక్షలో హరీశ్ రావు ఏ ర్యాంకు సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు