టార్గెట్ బీజేపీ... పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ నాటికి బలపడాలనే వ్యూహరచనలో ఉన్న బీజేపీ... మున్సిపల్ ఎన్నికలను ఇందుకోసం వినియోగించుకోవాలని ప్లాన్ చేసుకుంటోంది.

news18-telugu
Updated: June 19, 2019, 11:42 AM IST
టార్గెట్ బీజేపీ... పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)
news18-telugu
Updated: June 19, 2019, 11:42 AM IST
లోక్ సభ ఎన్నికల తరువాత జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. చాలాకాలం తరువాత పార్టీ సమావేశంలో అధినేత కేసీఆర్ పాల్గొంటుండటంతో... ఆయన నేతలకు ఏ రకమైన దిశానర్దేశం చేయనున్నారనే అంశం ఆసక్తిగా మారింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిపోయినా... త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ... మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. పట్టణ ప్రాంత ఓటర్లలో బీజేపీకి కొంతమేర సానుకూలతలు ఉంటాయనే భావన నేపథ్యంలో... వీటిపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది.

ఇదే అంశం టీఆర్ఎస్‌ను కూడా టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ నాటికి బలపడాలనే వ్యూహరచనలో ఉన్న బీజేపీ... మున్సిపల్ ఎన్నికలను ఇందుకోసం వినియోగించుకోవాలని ప్లాన్ చేసుకుంటోంది. దీంతో బీజేపీకి చెక్ చెప్పేలా... మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించాలని కేసీఆర్ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారని తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో పలు సిట్టింగ్ స్థానాల్లో ఓటమి తరువాత కేసీఆర్ ఇప్పటివరకు పార్టీ నేతలతో సమావేశం కాలేదు. ఈ సమావేశంలోనే ఆ ఓటమికి సంబంధించిన అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం తరువాత కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దెబ్బకొట్టామనే భావనలో ఉన్న కేసీఆర్... ఇప్పుడు తన ఫోకస్ అంతా బీజేపీ బలపడకుండా తీసుకోవాల్సిన చర్యలపైనే కేంద్రీకృతం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...