మంత్రి ఈటలపై కేటీఆర్ ఎఫెక్ట్... కేసీఆర్ లెక్క ఇదేనా ?

మంత్రి ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన ఏమిటనే అంశంపై రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: August 31, 2019, 1:03 PM IST
మంత్రి ఈటలపై కేటీఆర్ ఎఫెక్ట్... కేసీఆర్ లెక్క ఇదేనా ?
సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్
  • Share this:
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ను త్వరలోనే మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే అనే ప్రచారం కూడా జరిగింది. ఓ కీలకమైన విషయాన్ని లీక్ చేశారనే కారణంగానే ఈటల రాజేందర్‌పై కేసీఆర్ అసంతృప్తికి కారణమనే ఊహాగానాలు కొద్దిరోజుల క్రితం చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ ఎలా ఉన్నా... అసలు ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన ఏమిటనే అంశంపై రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన కుమారుడైన కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం కోసమే ఈటల రాజేందర్‌ను తప్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కేటీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే... ఇప్పటికే జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకరిని కేబినెట్‌ను తప్పించకతప్పని పరిస్థితి. తొలిసారి కేబినెట్‌లోకి తీసుకున్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కేసీఆర్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ను తప్పించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలో సిరిసిల్లకు చెందిన కేటీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.

Published by: Kishore Akkaladevi
First published: August 31, 2019, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading