Home /News /politics /

TELANGANA CM KCR PLANNING TO CAMPAIGN IN THE UTTAR PRADESH ASSEMBLY ELECTIONS IN SUPPORT OF THE SAMAJWADI PARTY PRV

CM KCR: బీజేపీకి చెక్​ పెట్టే యోచనలో సీఎం కేసీఆర్​.. యూపీలో ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్​ బాస్​ సమాయత్తం?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలైపోయింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తన పోరాటంలో కీలక వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Five state assembly elections) కోలాహలం మొదలైంది.  దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ (Elections Notification) కూడా వెలువడింది. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ సహా భారతీయ జనతా పార్టీ  (BJP)అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ఇప్పటికే ప్రచార వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు (Political parties) తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.

యూపీలో అధికారం కీలకం..

కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో అధికారంలో ఉండి తీరాల్సిందేనని రాజకీయ నిపుణలు (Political experts) అభిప్రాయపడుతారు. నాలుగు వందలకు పైగా అసెంబ్లీ స్థానాల్లో (Assembly constitutes) ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ (Polling)​ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ (election Commission)​ ఇటీవలె ప్రకటించింది. దీంతో యూపీలో ప్రచారం మొదలైపోయింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు  తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) తన పోరాటంలో కీలక వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ యూపీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ (Telangana)లో తమను ఇబ్బందులకు గురిచేస్తూ ఇరుకున పెడుతున్న బీజేపీని గద్దె దించాలని కేసీఆర్​ అనుకుంటున్నారు. దీనిలో భాగంగా యూపీలో ప్రచారానికి దిగనున్నట్లు తెలుస్తోంది.

యూపీలో తెలుగు ప్రజల ఓట్లు ..

మరోవైపు యూపీ ఎన్నికల్లో కేసీఆర్ (Telangana CM KCR) ​ ప్రచారం చేయాల్సిందిగా సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేష్​ యాదవ్ (Samajwadi Party chief Akhilesh Yadav)​ కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ తెలంగాణ, ఏపీల నుంచి పనులు, వ్యాపారాల నిమిత్తం వెళ్లి స్థిరపడిన వారు చాలామందే ఉన్నారు. దీంతో తెలుగు ప్రజల ఓట్లు (Telugu peoples Votes) యూపీలో చాలా కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ (Telangana CM KCR) ను యూపీ ప్రచారంలో పాలు పంచుకోవాల్సిందిగా ఎస్పీ (SP) అధినేత అఖిలేశ్​ కోరుతున్నట్లు తెలుస్తోంది. 2018లో కూడా యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్​ ఫెడరల్ ఫ్రంట్​ ఆలోచన చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం అప్పట్లో ప్రగతి భవన్​లో ఎస్పీ అధినేత అఖిలేష్​తో కూడా కేసీఆర్​ మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా అఖిలేష్​తో కేసీఆర్​కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.

పరిస్థితులు అనుకూలించని సందర్భంలో..

అయితే ప్రస్తుతం కోవిడ్​ ఆంక్షలు (Covid Restrictions) ఉండటంతో ప్రచారం మొత్తం ఆన్​లైన్​ వేదికగానే జరుపుతున్నారు. ఇంటింటికీ అంటే నలుగురు లేదా ఐదుగురు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్​ బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలు తక్కువే. పరిస్థితులు అనుకూలించని సందర్భంలో ఏదైన లేఖ (Open letter) ద్వారా యూపీలో సమాజ్​వాదీ పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా తెలుగుప్రజలను  సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ​ కోరనున్నట్లు తెలుస్తోంది.

యూపీలో బీజేపీని గద్దె దించితే బీజేపీ కేంద్రంలో చతికిలపడటం ఖాయం. మరోవైపు తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ తన క్యాడర్​ పెంచుకుంటూ టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఈ సమయంలో బీజేపీకి చెక్​ పెట్టాలని సీఎం కేసీఆర్​ యోచిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీపై పట్టు సాధించాలంటే మందుగా కేంద్రంలో బీజేపీకి అధికారం దూరం చేయాలని కేసీఆర్​ యోచిస్తున్నారు. దీనికి ఉత్తరప్రదేశ్​ చాలా కీలకం. ఈ నేపథ్యంలో గులాబీ బాస్​ కూడా యూపీలో ప్రచారానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Akhilesh Yadav, Assembly Election 2022, Bjp, CM KCR, Samajwadi Party, Trs, UP Assembly Elections 2022, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు