తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డికి చాలా రోజులుగా అపద్దర్మ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదన్న కథనాలు వినిపిస్తున్నాయి. తన అల్లుడికి ముషీరాబాద్ టిక్కెట్ ఇప్పించుకోవడానికి నాయిని నర్సింహారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో నేరుగా సీఎం కేసీఆర్ కలిసేందుకు ఆయన విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నాయినికి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న సమాచారం. దీంతో చేసేది లేక మంత్రి నాయిని కేటీఆర్ వద్ద తన ఆవేదన వెల్లగక్కినట్లు తెలుస్తోంది. అల్లుడు శ్రీనివాసరెడ్డికి ముషీరాబాద్ టిక్కెట్ ఇవ్వాలని...లేకపోతే తనకైనా టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే వెన్నంటి ఉన్న నాయిని నర్సింహారెడ్డిని టీఆర్ఎస్ అధిష్టానం ఘోరంగా అవమానిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గ సహచరులను కూడా పట్టించుకోవడంలేదని.. కార్యకర్తలను ఘోరంగా బానిసలుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మారిందని...ఏ మంత్రికీ అపాయింట్ మెంట్ దొరికే పరిస్థితే లేదన్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా పర్వాలేదుగానీ...కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.
కాగా తాను ముషీరాబాద్ నుంచి ఎల్బీ నగర్‌కు మారితే రూ.10 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ చెప్పారన్న నాయిని వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి చెప్పారు. నాయిని వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.